లద్దాఖ్‌లో ‘గల్వాన్‌’ అమర జవానుల స్మారకం

ABN , First Publish Date - 2020-10-04T07:35:13+05:30 IST

గల్వాన్‌ ఘర్షణలో అమర జవానుల ప్రాణ త్యాగానికి చిహ్నంగా లద్దాఖ్‌లో స్మారకాన్ని నిర్మించారు. గల్వాన్‌ లోయలో ఈ ఏడాది జూన్‌ 15న దొంగదెబ్బకు తెగబడిన చైనా సైన్యాన్ని అడ్డుకునే క్రమంలో కల్నల్‌ సంతోశ్‌బాబుతో సహా 20 మంది మన సైనికులు వీర మరణం పొందిన విషయం తెలిసిందే...

లద్దాఖ్‌లో ‘గల్వాన్‌’ అమర జవానుల స్మారకం

న్యూఢిల్లీ, అక్టోబరు 3: గల్వాన్‌ ఘర్షణలో అమర జవానుల ప్రాణ త్యాగానికి చిహ్నంగా లద్దాఖ్‌లో స్మారకాన్ని నిర్మించారు. గల్వాన్‌ లోయలో ఈ ఏడాది జూన్‌ 15న దొంగదెబ్బకు తెగబడిన చైనా సైన్యాన్ని అడ్డుకునే క్రమంలో కల్నల్‌ సంతోశ్‌బాబుతో సహా 20 మంది మన సైనికులు వీర మరణం పొందిన విషయం తెలిసిందే. వారి ధీరత్వానికి గుర్తుగా షయోక్‌-దౌలత్‌బేగ్‌ ఓల్ది రహదారిలో పోస్ట్‌ 120 వద్ద ఆర్మీ దీనిని నిర్మించింది. జాతి కోసం ఆపరేషన్‌ ‘మంచు చిరుత’లో నేలకొరిగిన ‘గాలంట్స్‌ ఆఫ్‌ గల్వాన్‌’ అని కొనియాడుతూ స్మారక ఫలకంపై 20 మంది సైనికుల పేర్లను రాసింది.

Updated Date - 2020-10-04T07:35:13+05:30 IST