గల్వాన్‌ మొత్తం మాదే: చైనా

ABN , First Publish Date - 2020-06-21T06:53:57+05:30 IST

గల్వాన్‌ లోయపై చైనా మరోసారి అబద్ధాలు ఆడుతోంది. ఆ లోయ మొత్తం తమదేనని అంటోంది. అది వాస్తవాధీన రేఖ లోపల తమ వైపు ఉందని వాదిస్తోంది. ఇటీవలి ఘర్షణల నేపథ్యాన్ని అనుకూలంగా వక్రీకరిస్తూ చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఝావో లిజియాన్‌ శనివారం ఈ మేరకు వరుసగా ట్వీట్‌లు చేశారు...

గల్వాన్‌ మొత్తం మాదే: చైనా

  • అతిశయోక్తులు, డొల్ల వాదన చాలించండి: భారత్‌

న్యూఢిల్లీ, జూన్‌ 20: గల్వాన్‌ లోయపై చైనా మరోసారి అబద్ధాలు ఆడుతోంది. ఆ లోయ మొత్తం తమదేనని అంటోంది. అది వాస్తవాధీన రేఖ లోపల తమ వైపు ఉందని వాదిస్తోంది. ఇటీవలి ఘర్షణల నేపథ్యాన్ని అనుకూలంగా వక్రీకరిస్తూ చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఝావో లిజియాన్‌ శనివారం ఈ మేరకు వరుసగా ట్వీట్‌లు చేశారు. గల్వాన్‌ వద్ద ఏళ్లుగా తమ సైనికులు పహారా కాస్తున్నారని చెప్పుకొచ్చారు. కాగా గల్వాన్‌ లోయపై చైనా వాదనను భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాత్సవ గట్టిగా తిప్పికొట్టారు.


చైనాదంతా అతిశయోక్తులు, అవాస్తవాలతో కూడిన డొల్ల వాదన అని ఖండించారు. వారు సరిహద్దును అతిక్రమించాలని చూడగా భారత దళాలు తప్పనిసరై ప్రతిఘటనకు దిగాయన్నారు. మరోవైపు గల్వాన్‌ మొత్తం తమదేనంటున్న చైనా వైఖరిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2020-06-21T06:53:57+05:30 IST