పథకం ప్రకారమే గల్వాన్‌ దాడి

ABN , First Publish Date - 2020-12-03T08:13:59+05:30 IST

చైనా ఈ ఏడాది జూన్‌లో కుట్రపూరితంగానే ఓ పథకం ప్రకారం గల్వాన్‌ లోయలో దాడికి పాల్పడినట్లు అమెరికాకు చెందిన అత్యున్నత కమిషన్‌ వెల్లడించింది.

పథకం ప్రకారమే గల్వాన్‌ దాడి

వెల్లడించిన అమెరికా అత్యున్నత కమిషన్‌

వాషింగ్టన్‌, డిసెంబరు 2: చైనా ఈ ఏడాది జూన్‌లో కుట్రపూరితంగానే ఓ పథకం ప్రకారం గల్వాన్‌ లోయలో దాడికి పాల్పడినట్లు అమెరికాకు చెందిన అత్యున్నత కమిషన్‌ వెల్లడించింది. ఈ మేరకు అమెరికా మీడియా కథనాలను ప్రసారం చేసింది. జూన్‌లో జరిగిన ఈ దాడిలో.. 20 మంది భారతీయ జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. చైనా పీఎల్‌ఏ సైన్యం తరఫున 45 మంది మరణించి ఉంటారని అమెరికా మీడియా పేర్కొంది. యునైటెడ్‌ స్టేట్స్‌-చైనా ఎకనామిక్‌ అండ్‌ సెక్యూరిటీ రివ్యూ కమిషన్‌(యూఎ్‌ససీసీ) నివేదిక ప్రకారం.. చైనా పథకం ప్రకారమే గల్వాన్‌లో కవ్వింపు చర్యలకు దిగింది. భారత్‌కు ప్రాణ నష్టం కలిగించడమే దాని ప్రధాన ఉద్దేశమని తెలిపే సాక్ష్యాలు లభించాయని యూఎ్‌ససీసీ నివేదిక వెల్లడించింది. ఈ ఘర్షణకు కొన్ని వారాల ముందు నుంచి చైనా రక్షణమంత్రి సరిహద్దులో స్థిరత్వం కోసం సైన్యాన్ని దాడులకు ప్రేరేపించారని వెల్లడించింది.


పాంగాంగ్‌లో యుద్ధ పడవలు

ఓ వైపు చర్చలు జరుపుతున్నామంటూనే చైనా తన కుయుక్తలను మాత్రం ఆపడం లేదు. తాజాగా పాంగాంగ్‌ సరస్సులో 928డీ రకానికి చెందిన ఆరు యుద్ధ పడవలను మోహరించింది. వాటితోపాటు.. 20 మంది సైనికులను తీసుకెళ్లే సీబీ-90 రకం పడవలతో పాంగాంగ్‌లోగస్తీలు కొడుతోంది

Updated Date - 2020-12-03T08:13:59+05:30 IST