ఢిల్లీ సరిహద్దుల మూసివేత...కర్ఫ్యూ పాస్ ఉంటేనే అనుమతి

ABN , First Publish Date - 2020-03-24T13:37:13+05:30 IST

ఢిల్లీలోకి ప్రవేశించాలంటే కర్ఫ్యూ పాస్‌లు ఉంటేనే అనుమతిస్తామని ఢిల్లీ పోలీసు కమిషనర్ ఎస్ ఎన్ శ్రీవాస్తవ చెప్పారు....

ఢిల్లీ సరిహద్దుల మూసివేత...కర్ఫ్యూ పాస్ ఉంటేనే అనుమతి

న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో లాక్‌డౌన్ ప్రకటించడంతోపాటు అంతర్ రాష్ట్ర సరిహద్దులను మూసివేశారు. ఢిల్లీ - గురుగ్రామ్ ఎక్స్ ప్రెస్ వేలోని సరిహద్దు వద్ద పోలీసులు బయట ప్రాంతాల నుంచి వాహనాల రాకపోకలను నిషేధించారు. గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్ నగరాల నుంచి ఢిల్లీలోకి ప్రవేశించాలంటే కర్ఫ్యూ పాస్‌లు ఉంటేనే అనుమతిస్తామని  ఢిల్లీ పోలీసు కమిషనర్ ఎస్ ఎన్ శ్రీవాస్తవ చెప్పారు. ఢిల్లీలో లాక్ డౌన్ ను అమలు చేస్తున్నామని, వైద్యఆరోగ్య శాఖ ఉద్యోగులు, ఫుడ్ డెలివరీ సిబ్బంది, బ్యాంకు సిబ్బంది, జర్నలిస్టులను మాత్రమే అనుమతిస్తామని పోలీసు కమిషనర్ చెప్పారు. ఢిల్లీ-హర్యానా సరిహద్దులను కూడా మూసివేశారు. కర్ఫ్యూ పాస్ ఉన్నవారినే ఢిల్లీలోకి  అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. అత్యవసర సర్వీసుల్లో పనిచేస్తున్న వారు పోలీసు శాఖ నుంచి కర్ఫ్యూ పాస్ పొందాలని శ్రీవాస్తవ కోరారు. 

Read more