వలసకూలీల శిబిరంలో ఉచితంగా వైఫై...కుటుంబసభ్యులతో మాటామంతీ

ABN , First Publish Date - 2020-04-24T16:51:56+05:30 IST

లాక్ డౌన్ వల్ల బెంగళూరు నగరంలో చిక్కుకుపోయిన వలస కార్మికుల సహాయ పునరావాస శిబిరాల్లో ఉచితంగా వైఫై సౌకర్యాన్ని సర్కారు కల్పించింది....

వలసకూలీల శిబిరంలో ఉచితంగా వైఫై...కుటుంబసభ్యులతో మాటామంతీ

 బెంగళూరు (కర్ణాటక): లాక్ డౌన్ వల్ల బెంగళూరు నగరంలో చిక్కుకుపోయిన వలస కార్మికుల సహాయ పునరావాస శిబిరాల్లో ఉచితంగా వైఫై సౌకర్యాన్ని సర్కారు కల్పించింది. దీంతో వలస కార్మికుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. రీచార్జ్ చేయించుకోలేక కుటుంబాలకు దూరంగా లాక్ డౌన్ వల్ల బెంగళూరులోని సహాయ శిబిరాల్లో చిక్కుకుపోయిన వలసకూలీలు వారి కుటుంబసభ్యులతో మాట్లాడలేక  పోయారు. కూలీల విన్నపం మేర బెంగళూరు అధికారులు శిబిరంలో ఉచితంగా వైఫై సౌకర్యం కల్పించారు. దీంతో కూలీలు వారి కుటుంబసభ్యులతో వాట్పాప్ కాల్స్ లో  మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోగలిగారు. రాయచూర్ గ్రామానికి చెందిన దేవి, శరణప్పలు ఏడేళ్ల సుశీల్ అనే కుమారుడిని తల్లిదండ్రుల వద్ద వదిలి కూలీ పని చేసేందుకు బెంగళూరుకు వలసవచ్చారు. తన కుమారుడు సుశీల్ తో వాట్పాప్ కాల్ లో మాట్లాడిన దేవి ఆనందం వ్యక్తం చేశారు. వెయ్యిమంది కార్మికులున్న ఈ శిబిరంలో టీవీ పెట్టి వైఫై హాట్ స్పాట్ ఏర్పాటు చేశారు. దీంతో కూలీలు తమ కుటుంబసభ్యులతో మాట్లాడుకోవడంతోపాటు వారికి వినోదాన్ని అందిస్తున్నారు.  

Updated Date - 2020-04-24T16:51:56+05:30 IST