నటి ప్రణీత పేరుతో టోకరా

ABN , First Publish Date - 2020-10-14T07:32:18+05:30 IST

ప్రముఖ దక్షిణాది హీరోయిన్‌, ‘అత్తారింటికి దారేది’ ఫేం ప్రణీత సుభాష్‌ పేరిట ఓ కంపెనీ యజమానికి రూ.13.50 లక్షలకు టోకరా వేసిం దో ఘరానా ముఠా. బెంగళూరు హైగ్రౌండ్స్‌ స్టేషన్‌ పోలీసుల కథనం ప్రకారం.. చెన్నై నుంచి ఈ నెల 6న బెంగళూరుకు వచ్చిన అగంతుకులు ఓ హోటల్‌ లో ఎస్‌వీ గ్రూపు అండ్‌ డెవలపర్స్‌ కంపెనీ చైర్మన్‌ అమరనాథ్‌రెడ్డిని కలిశారు...

నటి ప్రణీత పేరుతో టోకరా

  • నిందితుల కోసం గాలింపు

బెంగళూరు, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ దక్షిణాది హీరోయిన్‌, ‘అత్తారింటికి దారేది’ ఫేం ప్రణీత సుభాష్‌ పేరిట  ఓ కంపెనీ యజమానికి రూ.13.50 లక్షలకు టోకరా వేసిం దో ఘరానా ముఠా. బెంగళూరు హైగ్రౌండ్స్‌ స్టేషన్‌ పోలీసుల కథనం ప్రకారం.. చెన్నై నుంచి ఈ నెల 6న బెంగళూరుకు వచ్చిన అగంతుకులు ఓ హోటల్‌ లో ఎస్‌వీ గ్రూపు అండ్‌ డెవలపర్స్‌ కంపెనీ చైర్మన్‌ అమరనాథ్‌రెడ్డిని కలిశారు.


నిందితుల్లో వర్షా అనే యువతి తాను ప్రణీత మేనేజర్‌నని పరిచయం చేసుకోవడంతో ఆయన నమ్మారు. నటి ప్రణీతను ఆ కంపెనీ రాయబారిగా ఒప్పందం కుదురుస్తామని నమ్మబలికారు. దీనికి సంబంధించి అగ్రిమెంట్‌ చేయిస్తామని చెప్పడంతో ఆ మేరకు అమరనాథ్‌రెడ్డి వారికి రూ. 13.50 లక్షల నగదు ఇచ్చారు. ఆ తర్వాతి నుంచి వారు ఫోన్‌కు అందుబాటులోకి రాకపోవడంతో మోసం జరిగినట్లుగా భావించిన అమరనాథ్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


Updated Date - 2020-10-14T07:32:18+05:30 IST