ఫ్రాన్స్‌లో పదివేలు దాటిన కరోనా మరణాలు
ABN , First Publish Date - 2020-04-08T22:53:58+05:30 IST
కరోనా మహమ్మారి ధాటికి యూరప్ ఖండం అల్లాడిపోతోంది. ఇక్కడి ప్రధాన దేశాలన్నింటిలో కరోనా ప్రబలిపోయింది.

పారిస్: కరోనా మహమ్మారి ధాటికి యూరప్ ఖండం అల్లాడిపోతోంది. ఇక్కడి ప్రధాన దేశాలన్నింటిలో కరోనా ప్రబలిపోయింది. ఈ క్రమంలోనే ఫ్రాన్స్‌లో కరోనా మరణాలు పదివేల మార్కు దాటాయి. ఈ విషయాన్ని ఫ్రాన్స్ ఆరోగ్యశాఖ అత్యున్నత అధికారి జెరోమె సాలోమన్ బుధవారం వెల్లడించారు. దీన్ని నియంత్రించడం కోసం లాక్‌డౌన్ విధించి నాలుగు వారాలైనా.. తమ దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టలేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఫ్రాన్స్‌లో అధికారికంగా 10వేలమంది కరోనా కారణంగా మృతిచెందినట్లు ప్రకటించారు. దీంతో పదివేల కరోనా మరణాలు రికార్డయిన దేశాల జాబితాలో ఫ్రాన్స్ చేరింది. ఈ జాబితాలో చేరిన నాలుగో దేశం ఫ్రాన్స్. ఇప్పటికే దీని పొరుగు దేశాలైన ఇటలీ, స్పెయిన్‌తోపాటు అగ్రరాజ్యం అమెరికాలో పదివేలపైగా కరోనా మరణాలు నమోదయ్యాయి.