నాణ్యమైన సుగంధ ద్రవ్యాలకే ప్రాధాన్యం: జీవీఎల్‌

ABN , First Publish Date - 2020-11-13T09:07:08+05:30 IST

నాణ్యమైన సుగంధద్రవ్యాలకే ఎగుమతుల్లో ప్రాధాన్యం ఉంటుందని జాతీయ సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యుడు, మిర్చి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు...

నాణ్యమైన సుగంధ ద్రవ్యాలకే ప్రాధాన్యం: జీవీఎల్‌

న్యూఢిల్లీ, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): నాణ్యమైన సుగంధద్రవ్యాలకే ఎగుమతుల్లో ప్రాధాన్యం ఉంటుందని జాతీయ సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యుడు, మిర్చి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. నాణ్యమైన మిరప పంటకూ ఎగుమతుల్లో ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. గురువారం వర్చువల్‌ పద్ధతిలో జరిగిన టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. మిర్చి ఉత్పత్తుల ద్వారా ప్రతిఏటా రూ.6వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం సమకూరుతుందని తెలిపారు. మిరప పంట ఉత్పత్తి, ఎగుమతులు, ఇతర సమస్యలను తెలుసుకుని, నాణ్యమైన నిర్వహణ పద్ధతులపై అధ్యయనం కోసం క్షేత్రస్థాయిలో తాను పర్యటిస్తున్నట్లు చెప్పారు. త్వరలో తెలంగాణ, మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తానని పేరొన్నారు.  

Updated Date - 2020-11-13T09:07:08+05:30 IST