దూబే కాల్పుల్లో నలుగురు పోలీసులకు గాయాలు

ABN , First Publish Date - 2020-07-10T14:19:27+05:30 IST

దూబే జరిపిన కాల్పుల్లో నలుగురు పోలీసులు గాయపడ్డారని కాన్పూర్ ఎస్పీ చెప్పారు....

దూబే కాల్పుల్లో నలుగురు పోలీసులకు గాయాలు

కాన్పూర్ : గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ప్రయాణిస్తున్న కారు కాన్పూరులోని సచెండీ సరిహద్దు వద్దకు రాగానే ప్రమాదానికి గురవడంతో అతను పోలీసు నుంచి తుపాకీ లాక్కోని కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు యత్నించాడు. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో దూబే మరణించాడు. కారు బోల్తా పడగానే బయటకు వచ్చిన దూబే పోలీసు నుంచి పిస్టల్ లాక్కోని పారిపోయేందుకు యత్నించాడు. దూబే జరిపిన కాల్పుల్లో నలుగురు పోలీసులు గాయపడ్డారని కాన్పూర్ ఎస్పీ చెప్పారు. గాయపడిన పోలీసులను ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2020-07-10T14:19:27+05:30 IST