నేపాలీ యువకునికి గుండు చేయించిన నలుగురు అరెస్టు
ABN , First Publish Date - 2020-07-18T17:36:41+05:30 IST
యూపీలో ఒక వివాదాస్పద ఉదంతం చోటుచేసుకుంది. అయోధ్య విషయమై నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ చేసిన ప్రకటనను నిరసిస్తూ, ఒక నేపాలీ యువకునికి గుండు చేయించిన ఉదంతం వెలుగు చూసింది.

వారణాసి: యూపీలో ఒక వివాదాస్పద ఉదంతం చోటుచేసుకుంది. అయోధ్య విషయమై నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ చేసిన ప్రకటనను నిరసిస్తూ, ఒక నేపాలీ యువకునికి గుండు చేయించిన ఉదంతం వెలుగు చూసింది. ఈ ఉదంతంలో విశ్వహిందూ సేనకు చెందిన నలుగురు మద్దతుదారులను పోలీసులు అరెస్టు చేశారు. పరారైన హిందూ సేన అధ్యక్షుడు అరుణ్ పాథక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నేపాలీ యువకునికి గుండు చేయించి, దానిపై జైశ్రీ రామ్ అని రాయించిన ఘటనకు సంబంధించిన వైరల్‌గా మారింది. ఈ వీడియోను గంగా నది ఒడ్డున ఉన్న ఒక ఘాట్ దగ్గర చిత్రీకరించారని తెలుస్తోంది. అరుణ్ పాథక్ నగరంలోని కొన్ని ప్రదేశాలలో వివాదాస్పద పోస్టర్లను అతికించారు. భారతదేశంలో నివసిస్తున్న నేపాల్ ప్రజలు, పీఎం ఓలీ తమకు క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ పోస్టర్లలో హెచ్చరించారు. కాగా ఈ వీడియో వైరల్ అయిన నేపధ్యంలో భెలూపూర్ పోలీసులు అరుణ్ పాథక్‌పై కేసు నమోదు చేశారు.