ఉత్తరాఖండ్‌లో వరుసగా నాలుగో రోజు కొత్తగా నమోదుకాని కోవిడ్-19 కేసులు

ABN , First Publish Date - 2020-05-08T22:48:15+05:30 IST

కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో ఉత్తరాఖండ్ సత్ఫలితాలు సాధిస్తోంది

ఉత్తరాఖండ్‌లో వరుసగా నాలుగో రోజు కొత్తగా నమోదుకాని కోవిడ్-19 కేసులు

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో ఉత్తరాఖండ్ సత్ఫలితాలు సాధిస్తోంది. కొత్తగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడం  వరుసగా ఇది నాలుగో రోజు అని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం నాలుగు రోజుల నుంచి కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు కాలేదని తెలిపింది. 


ఉత్తరాఖండ్‌లో ఇప్పటి వరకు మొత్తం 61  కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపింది. వీరిలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం  కోవిడ్-19 పాజిటివ్ యాక్టివ్ కేసులు 15 అని వివరించింది.


కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపిన వివరాల ప్రకారం, దేశంలో గడచిన 24 గంటల్లో 3,390 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులునమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 1,273 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యాధిగ్రస్థుల రికవరీ రేటు 29.36కు చేరింది. దేశంలో ఇప్పటివరకూ 56,342 కేసులు నమోదు కాగా, 16,540 మంది కోలుకోగా, 1,886 మంది ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2020-05-08T22:48:15+05:30 IST