మాజీ మంత్రి రెహ్మాన్ ఖాన్ కన్నుమూత

ABN , First Publish Date - 2020-08-21T01:00:34+05:30 IST

డీఎంకే ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి ఎ.రెహ్మాన్ ఖాన్ అస్వస్థతతో గురువారంనాడు..

మాజీ మంత్రి రెహ్మాన్ ఖాన్ కన్నుమూత

చెన్నై: డీఎంకే ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి ఎ.రెహ్మాన్ ఖాన్ అస్వస్థతతో గురువారంనాడు ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1996-2001 మధ్య ఎం.కరుణానిధి కేబినెట్‌లో మంత్రిగా ఆయన పని చేశారు. రెహ్మాన్ ఖాన్ మృతికి డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్ సంతాపం తెలిపారు. అరివాలయంలోని పార్టీ కార్యాలయంలో రెహ్మాన్ ఖాన్ ఫోటో వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. పార్టీ జెండాలను అవనతం చేసి, పార్టీ కార్యక్రమాలను మూడు రోజుల పాటు వాయిదా వేశారు.

Updated Date - 2020-08-21T01:00:34+05:30 IST