కొవిడ్ నుంచి కోలుకున్న కొద్దిరోజులకే రాజస్థాన్ మాజీ మంత్రి మృతి

ABN , First Publish Date - 2020-11-25T22:58:44+05:30 IST

రాజస్థాన్ మాజీ ఆర్థిక మంత్రి మానిక్ చంద్ సూరన కన్నుమూశారు. గత నెలలో కరోనా బారిన 89 ఏళ్ల ఆయన కొద్దిరోజుల ..

కొవిడ్ నుంచి కోలుకున్న కొద్దిరోజులకే రాజస్థాన్ మాజీ మంత్రి మృతి

జైపూర్: రాజస్థాన్ మాజీ ఆర్థిక మంత్రి మానిక్ చంద్ సూరన కన్నుమూశారు. గత నెలలో కరోనా బారిన 89 ఏళ్ల ఆయన కొద్దిరోజుల చికిత్స అనంతరం ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్నారు. అయితే ఆయన ఆరోగ్యం మాత్రం మెరుగుపడలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం జైపూర్‌లోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా సూరన మృతి పట్ల పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా, సీఎం అశోక్ గెహ్లాట్ తదితరులు కూడా సూరన మృతిపట్ల సంతాపం ప్రకటించారు. సూరన్న అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడనీ... ఆర్థిక వ్యవహారాల మీద ఆయనకు  గట్టి పట్టుందని గవర్నర్ కొనియాడారు. కాగా సూరన ఎప్పుడూ పేదల అభ్యున్నతి కోసం పరితపించేవారని మాజీ సీఎం వసుంధర రాజే గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. 

Read more