సీబీఐ మాజీ డైరెక్టర్‌ అశ్వనీకుమార్‌ ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-10-08T06:52:46+05:30 IST

సీబీఐ మాజీ డైరెక్టర్‌ అశ్వనీ కుమార్‌ (69) బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. సిమ్లాలోని తన నివాసంలో ఆయన ఉరేసుకుని చనిపోయి ఉండగా కనుగొన్నారు. కొన్నాళ్లుగా ఆయన డిప్రెషన్‌లో ఉన్నట్లు పోలీసులు చెప్పారు...

సీబీఐ మాజీ డైరెక్టర్‌ అశ్వనీకుమార్‌ ఆత్మహత్య

సిమ్లా, అక్టోబరు 7: సీబీఐ మాజీ డైరెక్టర్‌ అశ్వనీ కుమార్‌ (69) బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. సిమ్లాలోని తన నివాసంలో ఆయన ఉరేసుకుని చనిపోయి ఉండగా కనుగొన్నారు. కొన్నాళ్లుగా ఆయన డిప్రెషన్‌లో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఇన్నాళ్ల జీవితంలో ఎంతో చూశానని, తదుపరి యాత్రకు సమయం ఆసన్నమైందని ఆయన వద్ద లభ్యమైన లేఖలో ఉన్నట్లు చెబుతున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌కు డీజీపీగా,మణిపూర్‌, నాగాలాండ్‌లకు గవర్నర్‌గా కూడా పనిచేశారు. 2008లో సీబీఐ డైరెక్టర్‌ అయ్యారు. 1973 బ్యాచ్‌ ఐపీఎస్‌ ఆఫీసరైన ఆయన.. సీబీఐ అధిపతిగా ఉన్న సమయంలోనే ఆరుషి తల్వార్‌ హత్యకేసు దర్యాప్తు సాగింది. 

Updated Date - 2020-10-08T06:52:46+05:30 IST