బార్క్ మాజీ సీఈవోకి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ

ABN , First Publish Date - 2020-12-31T05:27:01+05:30 IST

టీఆర్పీ కుంభకోణం కేసులో బార్క్ మాజీ సీఈవో పార్థో దాస్ గుప్తాను 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ ...

బార్క్ మాజీ సీఈవోకి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ

ముంబై: టీఆర్పీ కుంభకోణం కేసులో బార్క్ మాజీ సీఈవో పార్థో దాస్ గుప్తాను 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఎస్ప్లానేడ్ కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. ఈ నెల 24న పోలీసులు ఆయనను పుణేలో అరెస్ట్ చేశారు. టీఆర్పీ రేటింగును తారుమారు చేసిన కేసులో ఇంతకు ముందు ముంబై పోలీసులు రిపబ్లిక్ టీవీ సీఈవో వికాస్ ఖంచందానీని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. రిపబ్లిక్ చానెల్ డిస్ట్రిబ్యూషన్ హెడ్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఘన్‌శ్యాం సింగ్‌ను కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు. కాగా అక్టోబర్‌లో ముంబై పోలీసులు మరో నలుగురిని  అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరు వ్యక్తులు ఓ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ఉద్యోగులు కాగా.. రెండు చానెళ్లకు చెందిన యజమానులు కూడా అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్పీ కుంభకోణం కేసులో పోలీసులు పలు చానెళ్ల పేర్లను కూడా చేర్చారు. 

Updated Date - 2020-12-31T05:27:01+05:30 IST