ఫరూఖ్ అబ్దుల్లా ఆస్తులు జప్తు
ABN , First Publish Date - 2020-12-20T08:55:40+05:30 IST
జమ్ముకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (జేకేసీఏ)లో జరిగిన ఆర్థిక అవకతవకల ఆరోపణలకు సంబంధించి మనీలాండరింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న

న్యూఢిల్లీ, డిసెంబరు 19: జమ్ముకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (జేకేసీఏ)లో జరిగిన ఆర్థిక అవకతవకల ఆరోపణలకు సంబంధించి మనీలాండరింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా తదితరులకు చెందిన రూ.11.86 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్టు శనివారం అధికారవర్గాలు తెలిపాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ ప్రొవిజనల్ అటాచ్‌మెంట్ ఆదేశాన్ని జారీ చేసిందని, జమ్ము, శ్రీనగర్‌లోని ఆస్తులను జప్తు చేసినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. జప్తు చేసిన వాటిలో రెండు నివాస, ఒక కమర్షియల్ ప్రాపర్టీతోపాటు మూడు స్థలాలు ఉన్నట్టు చెప్పారు.