ఏనుగును వధించిన ఘటనకు సంబంధించిన తాజా అప్‌డేట్ ఇది..

ABN , First Publish Date - 2020-06-04T21:20:06+05:30 IST

కేరళలోని మలప్పురం జిల్లాలో బాణసంచా కూర్చిన పైనాపిల్‌ను ఆహారంగా అందించి.. గర్భంతో ఉన్న ఏనుగును వధించిన...

ఏనుగును వధించిన ఘటనకు సంబంధించిన తాజా అప్‌డేట్ ఇది..

మలప్పురం: కేరళలోని మలప్పురం జిల్లాలో బాణసంచా కూర్చిన పైనాపిల్‌ను ఆహారంగా అందించి.. గర్భంతో ఉన్న ఏనుగును వధించిన ఘటనపై బుధవారం దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో.. ఈ ఘటనను కేరళ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఏనుగుకు ఆ పరిస్థితి రావడానికి బాధ్యులైన వారిని గుర్తించి.. కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే సీఎం పినరయ్ విజయన్ స్పష్టం చేశారు. ఆ దిశగా కేరళ అటవీ శాఖ విచారణ ముమ్మరం చేసింది. తాజాగా ఈ కేసులో ఒక వ్యక్తిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే.. ఆ వ్యక్తి ఎవరనే విషయాన్ని బయటపెట్టలేదు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.


నోరు లేని మూగ జీవాన్ని నమ్మించి చంపడమేంటని పలువురు గళమెత్తుతున్నారు. ఘటనకు బాధ్యులపైన వారిపై చర్యలు తీసుకోవాలని సినీతారలు సహా పలువురు ప్రముఖులు డిమాండ్‌ చేశారు. జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించే వారిని కఠినంగా శిక్షించేలా చట్టాలు తీసుకురావాలని సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లు కోరారు. ‘పక్కా ప్రణాళిక ప్రకారమే ఏనుగు ప్రాణాలు తీశారు. ఆ మూగజీవికి న్యాయం జరగాలి’ అని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటా పేర్కొన్నారు. కేరళ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని మాజీ కేంద్రమంత్రి మేనకాగాంధీ తప్పుపట్టారు.

Updated Date - 2020-06-04T21:20:06+05:30 IST