నేపాలీని పెళ్లాడే విదేశీ మహిళకు పౌరసత్వం!!
ABN , First Publish Date - 2020-06-22T07:33:21+05:30 IST
నేపాల్ ప్రభుత్వం పౌరసత్వ చట్టంలో కీలక సవరణలు చేసేందుకు సిద్ధమైంది. నేపాలీ వ్యక్తిని వివాహం చేసుకునే విదేశీ మహిళకు ఏడేళ్ల తర్వాత దేశ పౌరసత్వం కల్పించాలనే ప్రతిపాదన కూడా ఈ సవరణల్లో ఉంది...

- పౌరసత్వ చట్టంలో సవరణకు నేపాల్ ప్రతిపాదన
కాఠ్మండు, జూన్ 21 : నేపాల్ ప్రభుత్వం పౌరసత్వ చట్టంలో కీలక సవరణలు చేసేందుకు సిద్ధమైంది. నేపాలీ వ్యక్తిని వివాహం చేసుకునే విదేశీ మహిళకు ఏడేళ్ల తర్వాత దేశ పౌరసత్వం కల్పించాలనే ప్రతిపాదన కూడా ఈ సవరణల్లో ఉంది. అయితే ఏడేళ్ల వరకు ఆమె స్థానిక పౌరుల్లాగే అన్ని రకాల ప్రభుత్వ ప్రయోజనాలను పొందుతూ జీవనం సాగించేందుకు వీలు కల్పిస్తారని సమాచారం. ఇటువంటి పలు ప్రతిపాదనలతో కూడిన పౌరసత్వ సవరణ బిల్లుకు ఇప్పటికే నేపాల్ పార్లమెంటరీ కమిటీ అంగీకారం లభించింది. త్వరలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే చట్టంగా రూపుదాల్చనుంది. కాగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన నేపాలీ కాంగ్రెస్, జనతా సమాజ్‌వాదీ పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి.