ఆస్పత్రిలో బోరిస్, బ్రిటన్ పగ్గాలు ఎవరివంటే...

ABN , First Publish Date - 2020-04-07T23:30:18+05:30 IST

కరోనాతో పోరాడుతున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సస్ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ పరిస్థితుల్లో బ్రిటన్ ప్రభుత్వ పగ్గాలు ఫారిన్ సెక్రెటరీ డోమినిక్ రాబ్ చేతుల్లోకి వెళ్లాయి.

ఆస్పత్రిలో బోరిస్, బ్రిటన్ పగ్గాలు ఎవరివంటే...

లండన్: కరోనాతో పోరాడుతున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సస్ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ పరిస్థితుల్లో బ్రిటన్ ప్రభుత్వ పగ్గాలు ఫారిన్ సెక్రెటరీ డోమినిక్ రాబ్ చేతుల్లోకి వెళ్లాయి. ఈ మేరకు క్యాబినెట్ కార్యాలయం మంత్రి మైఖేల్ గోవ్ ఓ ప్రకటన చేశారు. ప్రధాని బోరిస్ ఆసుపత్రికి పరిమితమైనప్పటికీ నిర్ణయాలు తీసుకోవడంలో ఎటువంటి ఆలస్యం జరగదన్నారు. ఇక బ్రిటన్‌లో అమలవుతున్న లాక్‌డౌన్‌‌పై సోమవారం జరగనున్న సమీక్షా సమావేశం వాయిదా పడుతుందా అని విలేకరులు అడగ్గా.. అలాంటిదేం ఉండదని ఆయన సమాధానమిచ్చారు. ‘అటువంటి ఏమీ జరగదు. ఈ విషయంలో క్యాబినెట్ సయుక్తంగా ఓ నిర్ణయం తీసుకుంటుంది. అయితే తుది నిర్ణయం మాత్రం ఫారిన్ సెక్రెటరీదే’ అని గోవ్ తెలిపారు. 


Updated Date - 2020-04-07T23:30:18+05:30 IST