కనికా స్నేహితుడికి బలవంతపు కరోనా పరీక్షలు
ABN , First Publish Date - 2020-03-24T09:09:41+05:30 IST
బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌తో కలిసి లఖ్‌నవూ వెళ్లి.. మళ్లీ ముంబై వచ్చిన ఆమె స్నేహితుడికి...

ముంబై, మార్చి 23: బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌తో కలిసి లఖ్‌నవూ వెళ్లి.. మళ్లీ ముంబై వచ్చిన ఆమె స్నేహితుడికి శనివారం రాత్రి బలవంతంగా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలకు ఆయన నిరాకరించడంతో పోలీసుల సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆదివారం ఆయనకు నెగెటివ్ రావడంతో ఇంటికి పంపించారు.