కరోనా నిర్ధారణకు..ఫెలూడా పేపర్ స్ట్రిప్ కిట్
ABN , First Publish Date - 2020-11-21T07:04:52+05:30 IST
దేశంలో కరోనా వైరస్ లక్షణాలను అతివేగంగా నిర్ధారించేందుకు కొత్తగా ఫెలుడా పేపర్ స్ట్రిప్ టెస్ట్ కిట్ అందుబాటులోకి వచ్చింది

న్యూఢిల్లీ,నవంబరు20(ఆంధ్రజ్యోతి): దేశంలో కరోనా వైరస్ లక్షణాలను అతివేగంగా నిర్ధారించేందుకు కొత్తగా ఫెలుడా పేపర్ స్ట్రిప్ టెస్ట్ కిట్ అందుబాటులోకి వచ్చింది. ఈ టెస్ట్ కిట్‌ను అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సహకారంతో టాటా గ్రూపు ప్రారంభించింది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. దీని ద్వారా గంటలోనే ఫలితం వెల్లడవుతుంది.