రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ అసలు ఉద్దేశం ఏంటో చెప్పిన ఆర్థిక మంత్రి

ABN , First Publish Date - 2020-05-13T21:55:22+05:30 IST

ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై పూర్తి వివరాలను వెల్లడించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్...

రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ అసలు ఉద్దేశం ఏంటో చెప్పిన ఆర్థిక మంత్రి

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై పూర్తి వివరాలను వెల్లడించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ మంత్రిత్వ శాఖలతో చర్చించిన అనంతరం ప్యాకేజీకి రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఈ ప్యాకేజీ దేశ అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. ‘స్వీయ ఆధారిత భారతం’ పేరుతో ప్యాకేజీకి రూపకల్పన చేసినట్లు ఆమె తెలిపారు. స్వదేశీ బ్రాండ్లను తయారుచేయడమే ఈ ప్యాకేజీ ముఖ్య ఉద్దేశమని నిర్మల చెప్పారు.


అంతర్జాతీయ స్థాయిలో భారత ఉత్పత్తులకు పేరు తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు. దేశాన్ని అన్ని రకాలుగా పునరుత్తేజం చేసేందుకే రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని రూపొందించినట్లు చెప్పారు. అందుకోసమే దీనికి ‘ఆత్మ నిర్భర్ భారత్’ అని పేరు పెట్టినట్లు తెలిపారు. ఐదు సూత్రాలతో ఈ ప్యాకేజీని రూపొందించామని.. ఆర్థిక, మౌలిక, సాంకేతిక, దేశ జనాభా, డిమాండ్ ప్రధాన సూత్రాలని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

Read more