లభించిన హామీ.. కార్యకలాపాలను పునఃప్రారంభించనున్న ఫ్లిప్ కార్ట్!

ABN , First Publish Date - 2020-03-26T02:23:03+05:30 IST

దేశం మొత్తం లాక్‌డౌన్ చేస్తున్నామంటూ ప్రధాని మోదీ ప్రకటించిన తరువాత తన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఫ్లిప్‌కార్ట్ తాజాగా వాటిని పునఃప్రారంభించేందుకు నిర్ణయించింది.

లభించిన హామీ.. కార్యకలాపాలను పునఃప్రారంభించనున్న ఫ్లిప్ కార్ట్!

న్యూఢిల్లీ: దేశం మొత్తం లాక్‌డౌన్ చేస్తున్నామంటూ ప్రధాని మోదీ ప్రకటించిన తరువాత  తన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఫ్లిప్‌కార్ట్ తాజాగా వాటిని పునఃప్రారంభించేందుకు నిర్ణయించింది. అయితే ఈ సేవలు కేవలం అత్యవసర వస్తువుల సరఫరాకు మాత్రమే పరిమితమవుతాయని తెలిపింది. ప్రదాని మోదీ ప్రకటన అనంతరం ఫ్లిప్ కార్ట్ తన కార్యక్రమాలకు కాస్త బ్రెక్ ఇచ్చింది. ముఖ్యంగా డెలివరీ బాయ్‌లకు అనుమతి ఉంటుందా? వారి భద్రతకు గ్యారంటీ ఉంటుందా అనే విషయాల్లో సంగ్ధిగ్ధత నెలకొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటకే అనేక సందర్భాల్లో డెలివరీ బాయ్‌లను అడ్డుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సంస్థ యాజామాన్యానికి ప్రభుత్వ వర్గాల నుంచి స్పష్టమైన హామీ రావడంతో తన కార్యక్రమాలను పునఃప్రారంభించేందుకు నిర్ణయించింది.


Updated Date - 2020-03-26T02:23:03+05:30 IST