కరోనా కాలంలో... ఫ్లిప్‌కార్ట్ గుడ్‌న్యూస్

ABN , First Publish Date - 2020-09-17T02:15:55+05:30 IST

కరోనా కష్టకాలంలో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‍కార్ట్ నిరుద్యోగులకు గుడ్‍న్యూస్‍ చెప్పింది. వచ్చే పండుగ సీజన్‍, బిగ్‍ బిలియన్‍ డేస్‍ ను (బీబీడీ) దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగా 70 వేల మందికి, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధిని కల్పించబోతోంది.

కరోనా కాలంలో... ఫ్లిప్‌కార్ట్ గుడ్‌న్యూస్

బెంగళూరు : కరోనా కష్టకాలంలో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‍కార్ట్ నిరుద్యోగులకు గుడ్‍న్యూస్‍ చెప్పింది. వచ్చే పండుగ సీజన్‍, బిగ్‍ బిలియన్‍ డేస్‍ ను (బీబీడీ) దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగా 70 వేల మందికి, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధిని కల్పించబోతోంది.


బెంగళూరు కేంద్రస్థానంగా ఈ కామర్స్ సేవలనందిస్తున్న ఫ్లిప్‍కార్ట్... తన సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునే క్రమంలో... డెలివరీ ఎగ్జ్సిక్యూటివ్‍లు, ప్యాకర్లు, స్టోర్‍ కీపర్లతోపాటు మానవ వనరుల విభాగంలో మరింత మందిని నియమించుకోబోతున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.


బిగ్‍ బలియన్‍ డేస్‍ సందర్భంగా అదనపు అవకాశాలు ఇస్తూనే వినియోగదారులకు గొప్ప అనుభవాన్నిచ్చేందుకు ప్రభావంతమైన భాగస్వామ్యాలు సృష్టించందుకు తాము దృష్టి సారించినట్లు కంపెనీ సీనియర్‍ వైస్‍ ప్రెసిడెంట్‍ అమితేష్‍ జా వెల్లడించారు. 

Updated Date - 2020-09-17T02:15:55+05:30 IST