ఖతర్ నుంచి కేరళ రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం రద్దు

ABN , First Publish Date - 2020-05-11T03:02:44+05:30 IST

‘వందే భారత్ మిషన్’లో భాగంగా ఖతర్‌లోని దోహా నుంచి కేరళలోని తిరువనంతపురం రావాల్సిన ఎయిర్ ఇండియా

ఖతర్ నుంచి కేరళ రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం రద్దు

న్యూఢిల్లీ: ‘వందే భారత్ మిషన్’లో భాగంగా ఖతర్‌లోని దోహా నుంచి కేరళలోని తిరువనంతపురం రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం IX 374 రద్దు అయినట్టు ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3:35 గంటలకు విమానం టేకాఫ్ కావాల్సి ఉండగా ఖతర్‌లోని అధికారుల నుంచి క్లియరెన్స్ లభించలేదని ఆయన పేర్కొన్నారు. దీంతో విమానం రద్దు అయినట్టు తెలిపారు. ఖతర్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు వెళ్లిన రెండో విమానం ఇది. విమానాన్ని తర్వాత తేదీకి రీషెడ్యూల్ చేయనున్నట్టు అధికారి తెలిపారు. 

Updated Date - 2020-05-11T03:02:44+05:30 IST