హథ్రాస్ ఘటనలో ఐదుగురు పోలీస్ సిబ్బంది సస్పెండ్

ABN , First Publish Date - 2020-10-03T16:41:16+05:30 IST

హథ్రాస్ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

హథ్రాస్ ఘటనలో ఐదుగురు పోలీస్ సిబ్బంది సస్పెండ్

యూపీ: హథ్రాస్ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బాధిత కుటుంబాన్ని విపక్షాలతోపాటు మీడియాను  సయితం కలుసుకోనీయకుండా యోగీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు రేగుతున్నాయి. హథ్రాస్ ఘటనపై సిట్ ప్రాథమిక నివేదిక ఆధారంగా యూపీ సీఎం ఎస్పీ సహా ఐదుగురు పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేశారు.


హథ్రాస్ దళిత బాలిక గ్యాంగ్ రేప్ హత్య ఘటనను కప్పిపుచ్చుకునేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తున్నాయి. యోగి ప్రభుత్వం మాత్రం ఈ ఘటనపై ప్రత్యేక బృందం దర్యాప్తు ముగిసే వరకు ఎలాంటి నిరసనలను అనుమతించరాదని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే హథ్రాస్ జిల్లాలోని బుల్గార్గీ గ్రామాన్ని ముట్టడించారు. ఊరి చుట్టూ బారికేడ్లు పెట్టారు. గ్రామంలో 144 సెక్షన్ విధించారు. సామూహిక అత్యాచారం, హత్యకు గురైన దళిత బాలిక కుటుంబ సభ్యులు నివశించే ఆ గ్రామంలోకి ఎవరూ వెళ్లకుండా లోపల నుంచి బాధిత కుటుంబం సహా ఎవరూ బయటకు రాకుండా పోలీసులు పహరా కాస్తున్నారు.

Updated Date - 2020-10-03T16:41:16+05:30 IST