రెండ్రోజుల తర్వాత ఢిల్లీలో మరో 5 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-03-26T02:00:18+05:30 IST

ఢిల్లీలో కొత్తగా ఐదు కరోనా కేసులు నమోదు

రెండ్రోజుల తర్వాత ఢిల్లీలో మరో 5 కరోనా కేసులు

న్యూఢిల్లీ: చాపకింద నీరులా దేశాన్ని కబళిస్తున్న కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి ప్రభుత్వాలు నానాతిప్పలూ పడుతున్నాయి. ఈ క్రమంలోనే లాక్ డౌన్ లు, షట్ డౌన్ లు ప్రకటిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత.. రెండు రోజులపాటు కొత్తగా కరోనా కేసులు నమోదు కాలేదు. దీంతో లాక్ డౌన్ తో కరోనాపై గెలవొచ్చని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భావించారు. మీడియా సమావేశంలో కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత కొత్త కరోనా కేసులు నమోదు కాలేదని తెలిపారు. అయితే ఈ సంతోషం మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. ఎందుకంటే గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 5 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఈ విషయాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బుధవారం వెల్లడించారు. దీంతో ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు 35కు చేరాయి. కొత్తగా కరోనా బారినపడిన ఐదుగురిలో ఒకరు విదేశం నుంచి వచ్చారని కేజ్రీవాల్ తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


Read more