గల్ఫ్ నుంచి వచ్చిన ఐదుగురికి కరోనా లక్షణాలు...

ABN , First Publish Date - 2020-05-08T13:57:25+05:30 IST

అబుదాబీ విమానంలోని ఐదుగురు ప్రయాణికులకు కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో వారిని ఆసుపత్రి ఐసోలేషన్ వార్డుకు తరలించారు.....

గల్ఫ్ నుంచి వచ్చిన ఐదుగురికి కరోనా లక్షణాలు...

ఐసోలేషన్ వార్డుకు తరలింపు

కొచ్చి (కేరళ): గల్ఫ్ దేశం నుంచి భారతీయులతో కూడిన ప్రత్యేక విమానం గురవారం రాత్రి కేరళ రాష్ట్రంలోని కొచ్చి విమానాశ్రయానికి వచ్చింది.అబుదాబీ నుంచి 181 మంది ప్రయాణికులతో కూడిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం  కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి రాగానే వైద్యాధికారులు ప్రయాణికులకు థర్మల్ స్ర్కీనింగు చేశారు. అబుదాబీ విమానంలోని ఐదుగురు ప్రయాణికులకు కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో వారిని ఆసుపత్రి ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అబుదాబి నుంచి 49 మంది గర్భిణులు, నలుగురు పిల్లలు కొచ్చికి తిరిగివచ్చారు. వారందరినీ హోంక్వారంటైన్ కు తరలించారు. అబుదాబీ నుంచి వచ్చిన ప్రయాణికులను 14 రోజుల పాటు డబ్బు చెల్లింపుపై క్వారంటైన్ కు తరలించారు. మే 7 నుంచి 13వతేదీ వరకు దశల వారీగా 64 విమానాల్లో 15వేల మందిని విదేశాల నుంచి స్వదేశానికి తరలించనున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీఅరేబియా, కువైట్, ఖతార్, బహ్రెయిన్, మాల్దీవులు, సింగపూర్, అమెరికా దేశాల  నుంచి ఎన్ఆర్ఐలను స్వదేశానికి తీసుకువస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి నిబంధనల ప్రకారం 14 రోజుల క్వారంటైన్ విధిస్తామని కేరళ అధికారులు చెప్పారు. 

Updated Date - 2020-05-08T13:57:25+05:30 IST