వైద్యసిబ్బందిపై రాళ్లు రువ్విన ఐదుగురికి కరోనా

ABN , First Publish Date - 2020-04-22T03:30:11+05:30 IST

కరోనా పోరులో ముందుండి పోరాడుతున్న వైద్యసిబ్బందిపై పలుప్రాంతాల్లో దాడులు జరిగాయి.

వైద్యసిబ్బందిపై రాళ్లు రువ్విన ఐదుగురికి కరోనా

మొరాదాబాద్: కరోనా పోరులో ముందుండి పోరాడుతున్న వైద్యసిబ్బందిపై పలుప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఇలాగే ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో కరోనాతో మరణించిన ఓ వ్యక్తి కుటుంబాన్ని క్వారంటైన్‌కు తరలించడానికి వెళ్లిన వైద్యసిబ్బంది, పోలీసుల బృందాలపై కొందరు రాళ్లు రువ్వారు. ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిబంధనల ప్రకారం ఈ ఐదుగురికి చేసిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. ఈ విషయాన్ని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎమ్‌సీ గార్గ్ వెల్లడించారు.

Updated Date - 2020-04-22T03:30:11+05:30 IST