శరత్కాలం నాటికి కరోనా వ్యాక్సిన్.. గుడ్‌న్యూస్ చెప్పిన ‘గవీ’

ABN , First Publish Date - 2020-05-24T23:29:36+05:30 IST

కరోనా వైరస్‌ను ఎదుర్కోగల శక్తిమంతమైన టీకా శరత్కాలం (సెప్టెంబరు-నవంబరు) నాటికి అందుబాటులోకి

శరత్కాలం నాటికి కరోనా వ్యాక్సిన్.. గుడ్‌న్యూస్ చెప్పిన ‘గవీ’

జ్యూరిచ్: కరోనా వైరస్‌ను ఎదుర్కోగల శక్తిమంతమైన టీకా శరత్కాలం (సెప్టెంబరు-నవంబరు) నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ‘గవీ’ వ్యాక్సిన్ కూటమి హెడ్ స్విస్ న్యూస్‌ పేపర్‌కు తెలిపారు. నిజానికి ఏ టీకా పనిచేస్తుందో తమకు తెలియదని, అసలు టీకా వస్తుందో, రాదో కూడా తెలియదని పేర్కొన్నారు. ఒకవేళ అదృష్టవంతులమైతే శరత్కాలం నాటికి శక్తిమంతమైన టీకా అందుబాటులోకి వస్తుందని గవీ హెడ్ బెర్క్‌లీ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే, ప్రపంచ జనాభాకు టీకా పెద్దమొత్తంలో అందుబాటులోకి రావాలంటే ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుందని అన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడానికి, దానిని పంచుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా సమన్వయంతో కూడిన ప్రయత్నాలకు పిలుపునిచ్చిన బెర్క్‌లీ.. ఒకసారి టీకా అందుబాటులోకి వచ్చిన తర్వాత దానిని వేగంగా ఉత్పత్తి చేయడానికి అవసరమైన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అంతర్జాతీయ ఒప్పందం అవసరమని పేర్కొన్నారు.  


Updated Date - 2020-05-24T23:29:36+05:30 IST