మహారాష్ట్రలో తొలి కరోనా బాధితులు కోలుకున్నారు..

ABN , First Publish Date - 2020-03-25T21:11:48+05:30 IST

మహారాష్ట్రలో తోలిసారి కరోనా బారినపడ్డ వారు కోలుకున్నట్లు తెలుస్తోంది.

మహారాష్ట్రలో తొలి కరోనా బాధితులు కోలుకున్నారు..

ముంబై: కరోనా మహమ్మారి మహారాష్ట్రలో ఏ స్థాయిలో విరుచుకు పడుతుందో తెలిసిందే. ఇక్కడ ఇప్పటికే కరోనా కేసులు 100 దాటాయి. దీంతో దేశంలో కూడా కరోనా కేసులు 590కు చేరాయి. కరోనాతో పోరులో భాగంగా మహారాష్ట్రలో ఇప్పటికే లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో తోలిసారి కరోనా బారినపడ్డ వారు కోలుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పూనే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. రెండువారాల చికిత్స అనంతరం ఇద్దరు వ్యక్తులకు చేసిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్ ఫలితాలు వచ్చాయని వారు చెప్పారు. 'ఈ ఇద్దరికి రెండుసార్లు పరీక్షలు జరిపాం. రెండుసార్లూ నెగిటివ్ ఫలితాలే వచ్చాయి. బుధవారం వీరిని డిశ్చార్జి చేసేస్తాం' అని అధికారులు ప్రకటించారు.


Read more