ఎంపీలో అగ్నిప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు మృతి

ABN , First Publish Date - 2020-05-19T00:52:38+05:30 IST

ఉదయం 10 గంటలకు సంభవించిన ఈ ప్రమాదంలో మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. రంగుల దుకాణం సహా మరోక గోడౌన్‌లో మంటలు చెలరేగాయి’’ అని పశ్చిమ గ్వాలియర్ అడిషనల్

ఎంపీలో అగ్నిప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు మృతి

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో సోమవారం సంభవించిన అగ్నిప్రమాదొంలో ఏడుగురు మరణించారు. నగరంలోని మూడు అంతస్తులు ఉన్న ఓ రంగుల దుకాణంలో కింది అంతస్తులో ఈ ప్రమాదం సంభవించింది. కాగా మరణించిన వారిలో ముగ్గురు చిన్నారులు కాగా నలుగురు మహిళలని పోలీసులు తెలిపారు. వీరంతా భవనంలోని రెండవ అంతస్తులో నివాసం ఉంటున్నవారు.


‘‘ఉదయం 10 గంటలకు సంభవించిన ఈ ప్రమాదంలో మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. రంగుల దుకాణం సహా మరోక గోడౌన్‌లో మంటలు చెలరేగాయి’’ అని పశ్చిమ గ్వాలియర్ అడిషనల్ ఎస్పీ సతేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.


మంటలు భవనానికి ప్రధాన ద్వారంలో చెలరేగడంతో ఇంట్లో ఉన్నవారికి బయటికి వెళ్లే మార్గం దొరకలేదని స్థానికులు అన్నారు. ఘటనా స్థలానికి పది ఫైర్ టెండర్లు చేరకుని మంటల్ని ఆర్పేశాయి.

Updated Date - 2020-05-19T00:52:38+05:30 IST