బస్సులో మంటలు.. ఐదుగురు సజీవదహనం
ABN , First Publish Date - 2020-08-12T20:15:40+05:30 IST
ఓ బస్సులో మంటలు చెలరేగి ఐదుగురు ప్రయాణికులుసజీవదహనమయ్యారు. వివరాలిలా ఉన్నాయి. కర్చినాటక రాష్త్రం లోని చిత్రదుర్గ జిల్లా హరియూరు సమీపంలో ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో... ఐదుగురు సజీవదహనం కాగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

చిత్రదుర్గ : ఓ బస్సులో మంటలు చెలరేగి ఐదుగురు ప్రయాణికులుసజీవదహనమయ్యారు. వివరాలిలా ఉన్నాయి. కర్చినాటక రాష్త్రం లోని చిత్రదుర్గ జిల్లా హరియూరు సమీపంలో ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో... ఐదుగురు సజీవదహనం కాగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
మృతి చెందినవారిలో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ కూడా ఉన్నారు. ప్రమాదానికి గురైన బస్సు బెంగళూరు నుంచి విజయపుర వెళుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
అనంతరం... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. కాగా... మృతుల సంఖ్య పెరిగే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.