పంజాబ్‌ పాఠశాల వ్యాన్‌లో మంటలు..

ABN , First Publish Date - 2020-02-16T07:29:22+05:30 IST

పంజాబ్‌లోని సంగ్రూర్‌ జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. పాఠశాల వ్యాన్‌లో అకస్మాత్తుగా మంటలు రేగడంతో శనివారం నలుగురు విద్యార్థులు సజీవ దహనమయ్యారు. కాసేపట్లో ఇంటికి చేరాల్సిన వారు విగతజీవులుగా మారారు. దుర్ఘటన

పంజాబ్‌  పాఠశాల వ్యాన్‌లో మంటలు..

నలుగురు విద్యార్థుల సజీవ దహనం


చండీగఢ్‌, ఫిబ్రవరి 15: పంజాబ్‌లోని సంగ్రూర్‌ జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. పాఠశాల వ్యాన్‌లో అకస్మాత్తుగా మంటలు రేగడంతో శనివారం నలుగురు విద్యార్థులు సజీవ దహనమయ్యారు. కాసేపట్లో ఇంటికి చేరాల్సిన వారు విగతజీవులుగా మారారు. దుర్ఘటన సమయంలో బస్సులో 12 మంది విద్యార్థులుండగా.. 8 మందిని స్థానికులు రక్షించారు. వీరంతా 10-12 ఏళ్ల మధ్య వయసు పిల్లలు. వ్యాన్‌ డ్రైవర్‌ తలుపులు తెరిచి విద్యార్థులను రక్షించేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది.

Updated Date - 2020-02-16T07:29:22+05:30 IST