వైరల్ వీడియా: ఈ మంట మంచిదే!

ABN , First Publish Date - 2020-05-11T21:09:10+05:30 IST

పార్క్‌లోని చెలరేగిన మంట చెట్లను, పచ్చగడ్డిని కాల్చకుండా ముందుకు సాగుతూ పోయింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కింది వీడియో చూస్తే ఔరా అనకుండా ఉండరు

వైరల్ వీడియా: ఈ మంట మంచిదే!

న్యూఢిల్లీ: పార్క్‌లోని చెలరేగిన మంట చెట్లను, పచ్చగడ్డిని కాల్చకుండా ముందుకు సాగుతూ పోయింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కింది వీడియో చూస్తే ఔరా అనకుండా ఉండరు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. లక్షల, కోట్ల వీక్షకులను కట్టి పడేస్తోంది. ఆ గడ్డిపై పేరుకుపోయిన తెల్లని పొరను కాల్చుతూ వెళ్తున్న ఆ వీడియోపై నెటిజెన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంత మంచి మంటను మేమెప్పుడూ చూడలేదని, ఎంతో మంచి మంట అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


స్పెయిన్ దేశంలో చిత్రించిన ఈ వీడియో ప్రపంచ జనాల్ని మంత్రముగ్దుల్ని చేస్తోంది. క్లబ్ డే మొంటానా కలహోర్రా అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఫేస్‌బుక్‌ ఖాతాలో తొలిసారి దర్శనం ఇచ్చిన ఈ వీడియో చూస్తుండగానే ప్రంపంచ వ్యాప్తమైంది. స్థానిక మీడియా తెలిపిన ప్రకారం.. ‘‘పచ్చగడ్డిపై పేరుకుపోయిన బూరుగ దూదిని కాల్చుకుంటూ మంట వేగంగా వెళ్లింది. దీంతో పచ్చగడ్డికి ఎలాంటి హానీ జరగలేదు. అలాగే పార్కులో ఉన్న చెట్లకు, బెంచ్‌కు కూడా ఆ మంట అంటుకోలేదు’’ అని పేర్కొంది.


దీనిపై కలహోరా మేయర్ కూడా తన మైక్రోబ్లాగింగ్ ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘‘బూరుగ దూది అంటుకుంటే ఆ మంటను ఆర్పడం సాధ్యం కాదు. చాలా వేగంగా బూరుగ ఎంత వరకు ఉంటే అంత వరకు కాలుతూ వెళ్తుంది. ఇలా చాలా తొందరగా వ్యాపిస్తుంది’’ అని ఆయన తెలిపారు.

Updated Date - 2020-05-11T21:09:10+05:30 IST