ప్లాస్టిక్ గోదాములో భారీ అగ్ని ప్రమాదం
ABN , First Publish Date - 2020-11-15T15:36:18+05:30 IST
యూపీలోని మీరట్‌కు సమీపంలోగల ఖర్‌ఖైదాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో...

మీరట్: యూపీలోని మీరట్‌కు సమీపంలోగల ఖర్‌ఖైదాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలలో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. వారు గంటపాటు ప్రయత్నించిన మీదట అగ్నికీలలు అదుపులోకి వచ్చాయి. కాగా ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడినట్లు సమాచారమేదీ లేదు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఖర్‌ఖైదా పరిధిలోని జాహిద్‌పూర్‌కు చెందిన కొంతమంది అక్రమంగా గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. అక్కడికి సమీపంలో ఉన్న ప్లాస్టిక్ గోదాములో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.