కొవిడ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. ఆరుగురు రోగుల మృతి
ABN , First Publish Date - 2020-11-27T11:52:59+05:30 IST
గుజరాత్ రాష్ట్రంలోని కొవిడ్ ఆసుపత్రి ఐసీయూలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఆరుగురు కరోనా రోగులు మరణించారు....

రాజ్‌కోట్ (గుజరాత్): గుజరాత్ రాష్ట్రంలోని కొవిడ్ ఆసుపత్రి ఐసీయూలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఆరుగురు కరోనా రోగులు మరణించారు. రాజ్ కోట్ నగరంలోని శివానంద్ ఆసుపత్రిలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. శివానంద్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో మంటలు చెలరేగడంతో అందులో ఉన్న ఆరుగురు కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఐసీయూలో మంటలు చెలరేగినపుడు 11 మంది రోగులున్నారు. ఈ అగ్నిప్రమాదంలో పలువురు రోగులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించారు. అగ్నిమాపకశాఖ అధికారులు హుటాహుటిన వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు.