తమిళనాడు బాణసంచా కర్మాగారంలో పేలుడు

ABN , First Publish Date - 2020-10-24T08:47:12+05:30 IST

మదురై జిల్లాలో బాణాసంచా తయారీ కర్మాగారంలో శుక్రవారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మహిళా కార్మికులు సజీవదహనమయ్యారు...

తమిళనాడు బాణసంచా కర్మాగారంలో  పేలుడు

  • ఐదుగురు మహిళల సజీవదహనం


చెన్నై, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): మదురై జిల్లాలో బాణాసంచా తయారీ కర్మాగారంలో శుక్రవారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మహిళా కార్మికులు సజీవదహనమయ్యారు. పేరైయూర్‌ తాలూకా మురుగనేరి గ్రామంలో షణ్ముగరాజ్‌కు చెందిన రాజ్యలక్ష్మి బాణాసంచా తయారీ కేంద్రంలో ఫ్యాన్సీ రకం టపాసుల తయారీకి రసాయనాలు కలుపుతున్న సమయంలో హఠాత్తుగా పేలుడు సంభవించింది. దుర్ఘటనపై ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. మృతులకు ఒక్కొక్కరికీ రూ.2 లక్షలు, గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.లక్ష సాయంగా అందిస్తున్నట్లు ప్రకటించారు.

Updated Date - 2020-10-24T08:47:12+05:30 IST