భారీ అగ్నిప్రమాదం...ఏడుగురు దుర్మరణం

ABN , First Publish Date - 2020-05-18T22:37:31+05:30 IST

రోష్‌నగర్‌ ఏరియాలోని మూడంతస్తుల రెసిడెన్సిల్ కమ్ కమర్షియల్ బిల్డింగ్‌లో జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. మృతులలో ..

భారీ అగ్నిప్రమాదం...ఏడుగురు దుర్మరణం

గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లోని వారసత్వ నగరమైన గ్వాలియర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రోష్‌నగర్‌ ఏరియాలోని మూడంతస్తుల రెసిడెన్సియల్  కమర్షియల్ బిల్డింగ్‌లో జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. మృతులలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మొదటి అంతస్తులో ఉంటున్నారు. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే నాలుగు అగ్నిమాపక శకటాలు అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశాయి. పలువురు కాంప్లెక్స్ వెనుకనున్న గోడను కూలదోసి బయటపడినట్టు తెలుస్తోంది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదని గ్వాలియర్ ఏఎస్‌పీ సత్యేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

Updated Date - 2020-05-18T22:37:31+05:30 IST