బెంగాల్ బీజేపీ అధ్యక్షుడిపై పోలీసు కేసు

ABN , First Publish Date - 2020-06-23T11:47:01+05:30 IST

మమతాబెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ సర్కారు పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తో పాటు ఆ పార్టీ నాయకులపై కేసు నమోదు చేసింది.....

బెంగాల్ బీజేపీ అధ్యక్షుడిపై పోలీసు కేసు

మిడ్నాపూర్ (పశ్చిమబెంగాల్): మమతాబెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ సర్కారు పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తో పాటు ఆ పార్టీ నాయకులపై కేసు నమోదు చేసింది. టీఎంసీ కార్యకర్తల దాడిలో డాంటాన్ పట్టణానికి చెందిన బీజేపీ కార్యకర్త పవన్ జన మరణించారు. పవన్ జనకు నివాళులు అర్పించేందుకు సామాజిక దూరం పాటించకుండా బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తోపాటు బీజేపీ  నాయకులు సుభాష్ నగర్ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. సామాజిక దూరం నిబంధనలను ఉల్లంఘించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తో పాటు బీజేపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ అధినేతతోపాటు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సయంతన్ బోస్, ఎంపీ పురూలియా జ్యోతిర్మయి, మిడ్నాపూర్ బీజేపీ అధ్యక్షుడు సమిత్ దాస్, మరో 150 మంది బీజేపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ కార్యకర్తలు ఎలాంటి అనుమతి తీసుకోకుండా సమావేశమై సామాజిక దూరం నిబంధనలను ఉల్లంఘించారని మిడ్నాపూర్ కొత్వాలీ పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ఫేస్ మాస్క్ లు ధరించ కుండా మిడ్నాపూర్ నగరంలో మోటార్ సైకిలు ర్యాలీ తీశారని పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. 

Updated Date - 2020-06-23T11:47:01+05:30 IST