లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన మాజీ ఎంపీపై కేసు
ABN , First Publish Date - 2020-05-13T11:39:28+05:30 IST
లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి వందలాదిమంది వలసకార్మికులను తీసుకువచ్చిన బీహార్ మాజీ ఎంపీ పప్పూయాదవ్ పై ఢిల్లీ పోలీసులు కేసు....

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలోని ఓఖ్లా మండీలో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి వందలాదిమంది వలసకార్మికులను తీసుకువచ్చిన బీహార్ మాజీ ఎంపీ పప్పూయాదవ్ పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. గర్హి గ్రామానికి చెందిన 300 మంది వలసకార్మికులు ఓఖ్లామండీ వద్ద గుమిగూడి తమను తమ స్వస్థలాలకు పంపించాలని డిమాండ్ చేశారు. వలసకార్మికుల డిమాండ్లను విన్న మాజీ ఎంపీ పప్పూయాదవ్ ప్రభుత్వంతో మాట్లాడి వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటానని హామి ఇచ్చారు.లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి వలసకార్మికులను సమీకరించిన మాజీ ఎంపీ పప్పూయాదవ్ పై ఢిల్లీ పోలీసులు ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసు నమోదు చేశారు.