రాష్ట్రానికి బయట ఉన్నవారికి సీఎం నగదు భరోసా!

ABN , First Publish Date - 2020-04-07T13:14:57+05:30 IST

లాక్ డౌన్ కారణంగా రాష్ట్రం వెలుపల చిక్కుకున్న బీహార్ ప్రజలకు ఆర్థిక సహాయం అందించే పథకాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రారంభించారు. ఈ పధకం కింద దీని కింద మొదటి రోజు....

రాష్ట్రానికి బయట ఉన్నవారికి సీఎం నగదు భరోసా!

పట్నా: లాక్ డౌన్ కారణంగా రాష్ట్రం వెలుపల చిక్కుకున్న బీహార్ ప్రజలకు ఆర్థిక సహాయం అందించే పథకాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్  ప్రారంభించారు. ఈ పధకం కింద దీని కింద మొదటి రోజు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న లక్షా మూడు వేల 579 మంది ఖాతాలకు వెయ్యి రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందజేశారు. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుండి ముఖ్యమంత్రి ప్రత్యేక సహాయం కింద ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న బీహార్ ప్రజలకు చేయూత నిచ్చారు. మొదటి రోజు 10 కోట్ల 35 లక్షల 79 వేల రూపాయలను వారివారి ఖాతాలలో జమ చేశారు. ఈ పధకానికి ఇప్పటివరకు 2 లక్షల  84 వేల 674 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులను పరిశీలించిన తరువాత నగదును త్వరలోనే మిగిలినవారి  ఖాతాలకు పంపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఢిల్లీ,  ఇతర నగరాల్లోని ప్రజలకు సహాయం చేయడానికి శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఆయాచోట్ల ఆహార పాకెట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు.

 

Read more