ఇరాన్ నుంచి 53 మంది భారత విద్యార్థుల జైసల్మేర్‌కు రాక
ABN , First Publish Date - 2020-03-16T14:59:53+05:30 IST
కరోనా వైరస్‌తో వణుకుతున్న ఇరాన్ దేశంలోని టెహరాన్, షిరాజ్ నగరాల నుంచి 53 మంది భారతీయులను ప్రత్యేక విమానంలో రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ నగరంలోని ఆర్మీ వెల్‌నెస్ సెంటరుకు తరలించారు......
జైసల్మేర్ (రాజస్థాన్): కరోనా వైరస్‌తో వణుకుతున్న ఇరాన్ దేశంలోని టెహరాన్, షిరాజ్ నగరాల నుంచి 53 మంది భారతీయులను ప్రత్యేక విమానంలో రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ నగరంలోని ఆర్మీ వెల్‌నెస్ సెంటరుకు తరలించారు. ఇరాన్ నుంచి వచ్చిన 52 మంది విద్యార్థులు, ఓ ఉపాధ్యాయుడికి విమానాశ్రయంలోనే వైద్యపరీక్షలు చేసి వారిని ఆర్మీ వెల్‌నెస్ సెంటరుకు తరలించారు. ఇరాన్ నుంచి భారతదేశానికి తీసుకువచ్చిన నాలుగో బృందం ఇది. ఇరాన్ దేశం నుంచి 389 మంది భారతీయులను నాలుగు విడతలుగా స్వదేశానికి తరలించామని, దీనికి సహకరించిన ఇరాన్ దేశ అధికారులకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఇరాన్ నుంచి వచ్చిన విద్యార్థుల బ్యాగులను సైతం శానిటైజ్ చేసి వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు.