బ్రహ్మపుత్రలో ఫెర్రీ బోట్ సర్వీసుల పునరుద్ధరణ
ABN , First Publish Date - 2020-05-10T02:33:33+05:30 IST
కోవిడ్-19 వ్యాప్తి నిరోధం కోసం అష్ట దిగ్బంధనం అమల్లో ఉన్నప్పటికీ
గువాహటి : కోవిడ్-19 వ్యాప్తి నిరోధం కోసం అష్ట దిగ్బంధనం అమల్లో ఉన్నప్పటికీ బ్రహ్మపుత్ర నదిలో ఫెర్రీ బోట్ సేవలను ఈ నెల 7 నుంచి పునరుద్ధరించారు. ప్రజలు రాకపోకలు సాగించడానికి, వస్తువుల రవాణాకు ఈ సేవలను పునరుద్ధరించారు.
అష్ట దిగ్బంధనం అమల్లో ఉన్నందువల్ల నిలిచిపోయిన ఫెర్రీ బోట్ సేవలను ఈ నెల 7 నుంచి పునరుద్ధరించారు. అయితే గతంతో పోల్చితే 50 శాతం మందికి మాత్రమే ప్రయాణించే అవకాశం కల్పిస్తారు. ముఖానికి మాస్క్‌లు ధరించనివారికి టిక్కెట్లు ఇవ్వరు.
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ సర్వీసులను పునరుద్ధరించినట్లు అస్సాం ఇన్‌లాండ్ వాటర్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ అధికారి దిలీప్ కుమార్ చెప్పారు. ప్రయాణికులను స్క్రీన్ చేసి, టెంపరేచర్‌ను తనిఖీ చేస్తామన్నారు. పడవ సామర్థ్యంలో 50 శాతం మందికి మాత్రమే ప్రయాణించే అవకాశం కల్పిస్తామన్నారు. ముఖానికి మాస్క్‌లు ధరించినవారికి మాత్రమే టిక్కెట్లు ఇస్తామన్నారు.