ఓటింగ్‌కు ముందు దారుణం... మహిళా సబ్ఇన్‌స్పెక్టర్ కాల్చివేత!

ABN , First Publish Date - 2020-02-08T12:30:42+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో మహిళా ఇన్‌స్పెక్టర్ ప్రీతి అహల్వాలియాను ఒక యువకుడు తుపాకీతో కాల్చి హత్య చేశాడు. ప్రీతి ఢిల్లీలోని పట్‌పడ్‌గంజ్ ఇండస్ట్రియల్ ఏరియాలో...

ఓటింగ్‌కు ముందు దారుణం... మహిళా సబ్ఇన్‌స్పెక్టర్ కాల్చివేత!

దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో మహిళా ఇన్‌స్పెక్టర్ ప్రీతి అహల్వాలియాను ఒక యువకుడు తుపాకీతో కాల్చి హత్య చేశాడు. ప్రీతి ఢిల్లీలోని పట్‌పడ్‌గంజ్ ఇండస్ట్రియల్ ఏరియాలో విధులు నిర్వహిస్తున్నారు. ఆమె నిన్న రాత్రి విధులు ముగించుకుని ఇంటికి నడిచి వెళుతున్న సమయంలో ఒక యువకుడు ఆమె వెనుకగా వచ్చి, మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. రెండు తూటాలు ఆమె శరీరంలోకి చొచ్చుకుపోగా, మరొక తూటా సమీపంలో ఉన్న కారు అద్దాలను ధ్వంసం చేసింది. కాల్పులు జరిగిన వెంటనే ప్రీతి కిందపడిపోయి, అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెపై కాల్పులు జరిపిన యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు వెంటనే పోలీసులకు ఈ సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఢిల్లీలో నేడు ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో ఈ ఘటన కలకలం రేపింది. 


Updated Date - 2020-02-08T12:30:42+05:30 IST