భ్రూణహత్యలు తగ్గాయి!

ABN , First Publish Date - 2020-07-10T07:40:50+05:30 IST

ఆడబిడ్డలకు శుభవార్త. భారతదేశంలో భ్రూణహత్యలతో నానాటికీ పడిపోతున్న లింగనిష్పత్తి ఎట్టకేలకు నిలబడింది. వరుసగా మూడేళ్ల పాటు పడిపోతూ ఉన్న లింగనిష్పత్తి 2018లో నిలబడింది...

భ్రూణహత్యలు తగ్గాయి!

  • భారత్‌ లింగ నిష్పత్తి పడిపోలేదు
  • మెరుగ్గా ఏపీ, మరో 3 రాష్ట్రాలు

న్యూఢిల్లీ, జూలై 9: ఆడబిడ్డలకు శుభవార్త. భారతదేశంలో భ్రూణహత్యలతో నానాటికీ పడిపోతున్న లింగనిష్పత్తి ఎట్టకేలకు నిలబడింది. వరుసగా మూడేళ్ల పాటు పడిపోతూ ఉన్న లింగనిష్పత్తి 2018లో నిలబడింది. ఆంధ్రప్రదేశ్‌(920/1000), అసోం(925/1000), జమ్మూ కశ్మీరు(927/1000), జార్ఖండ్‌(923/1000) రాష్ట్రాలు లింగనిష్పత్తి విషయంలో చూపించిన ప్రగతి జాతీయ సగటును నిలబెట్టింది. శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. 2012-14 కాలానికి భారతదేశ బాలికల లింగ నిష్పత్తి బాలురతో పోలిస్తే 906/1000 ఉండగా 2014-16 కాలానికి 898కి దిగజారింది.


2015-17 కాలానికి 896కు పడిపోగా, తొలిసారి 2016-18 కాలానికి 899కి పెరిగింది. పైన పేర్కొన్న నాలుగు రాష్ట్రాలు 2016-18 మధ్యకాలంలో తీసుకున్న సానుకూల చర్యల వల్లే వాటి గణాంకాలతో పాటు జాతీయ సగటు మెరుగు పడింది. ఢిల్లీ ఒక్కటే లింగనిష్పత్తిలో నానాటికీ పతనమౌతోంది. 2012-14లో 876/1000 ఉన్నది కాస్తా ఇప్పుడు 844కు తగ్గిపోయింది. గ్రామీణ హరియాణా ప్రాంతంలో భ్రూణహత్యల కారణంగా లింగ నిష్పత్తి దారుణంగా 828 మాత్రమే ఉంది. ఛత్తీ్‌సగఢ్‌లో దేశంలోకెల్లా అత్యధిక లింగనిష్పత్తి 976 నమోదు అయ్యింది.


Updated Date - 2020-07-10T07:40:50+05:30 IST