నేను కోలుకుంటున్నా.. కరోనా సోకిన ఎమ్మెల్యే ట్వీట్

ABN , First Publish Date - 2020-06-27T02:25:33+05:30 IST

తాను కరోనా నుంచి కోలుకుంటున్నానని ఢిల్లీ ఎమ్మెల్యే ఆతిషి ట్వీట్ చేశారు. ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీకి(ఆప్) చెందిన..

నేను కోలుకుంటున్నా.. కరోనా సోకిన ఎమ్మెల్యే ట్వీట్

న్యూఢిల్లీ: తాను కరోనా నుంచి కోలుకుంటున్నానని ఢిల్లీ ఎమ్మెల్యే ఆతిషి ట్వీట్ చేశారు. ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీకి(ఆప్) చెందిన ఆతిషికి కరోనా సోకినట్లు తేలింది. అప్పటి నుంచి ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆమె తన ఆరోగ్య పరిస్థితిపై ట్వీట్ చేశారు. ‘నా ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోంది. మూడు రోజులుగా ఆక్సిజన్ లెవెల్స్, పల్స్, టెంపరేచర్ నిలకడగానే ఉన్నాయి. మరికొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటే చాలని డాక్టర్లు చెప్పారు. నా గురించి ఆందోళన చెందుతున్న వారు భయపడొద్దు. మరికొద్ది రోజుల్లో నేను పూర్తిగా కోలుకుంటాను’ అని ఆతిషి ట్వీట్ చేశారు.

Updated Date - 2020-06-27T02:25:33+05:30 IST