కొడుకు ప్రేమించిన యువతిపై తండ్రి అత్యాచారం

ABN , First Publish Date - 2020-03-15T15:58:20+05:30 IST

కొడుకు ప్రేమించిన యువతిపై అత్యాచారానికి పాల్పడిన తండ్రి సహా

కొడుకు ప్రేమించిన యువతిపై తండ్రి అత్యాచారం

చెన్నై : కొడుకు ప్రేమించిన యువతిపై అత్యాచారానికి పాల్పడిన తండ్రి సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నాగపట్టణం జిల్లా వేదారణ్యం తాలూకాలో ఓ గ్రామానికి యువతికి (21)కి సోంపేట గ్రామానికి చెందిన కరుంబు నిత్యా నందం కుమారుడు ముఖేష్‌ (20)తో వృత్తి విద్యా కోర్సు అభ్యసిస్తున్న సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ప్రస్తుతం వీరిద్దరు చెన్నైలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, యువతి ఇంటికి ముఖేష్‌ తండ్రి నిత్యానందం వెళ్లి వివాహం చేస్తానని ఆమెకు చెప్పి ఆ యువతిని తీసుకెళ్లి సోంపేటలోని ఓ దుకాణంలో బంధించి తాళి కట్టి అత్యాచారం చేశాడు. 


అనంతరం ఆమెను అవరిక్కాడు గ్రామంలోని బంధువుల ఇంట్లో బంధించి చిత్రహింసలకు పాల్పడ్డాడు. అక్కడి నుంచి ఎలాగోలా తప్పిం చుకున్న ఆ యువతి వేదారణ్యం మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి విచారణ చేపట్టిన పోలీసులు, నిత్యానందం సహా అతని బంధువులు శక్తివేల్‌, మౌనరాజవల్లిని అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో, జిల్లా ఎస్పీ సెల్వనాగరత్నం సిఫార్సు తో జైలులో ఉన్న నిత్యానందంను గూండాచట్టం కింద అరెస్ట్‌ చేస్తూ కలెక్టర్‌ ప్రవీణ్‌పినాయర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - 2020-03-15T15:58:20+05:30 IST