మెహబూబా ముఫ్తీని కలిసి ఫారూఖ్ అబ్దుల్లా

ABN , First Publish Date - 2020-10-14T21:39:04+05:30 IST

వీరి భేటి జమ్మూ కశ్మీర్ కోల్పోయిన ఆర్టికల్ 370 ని పునరుద్ధరించడమేనని వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని ఫారూఖ్ అబ్దుల్లా వద్ద ప్రస్తావించగా తమ కలయికలో ఎలాంటి రాజకీయ ప్రస్తావన లేదని చెప్పుకొచ్చారు

మెహబూబా ముఫ్తీని కలిసి ఫారూఖ్ అబ్దుల్లా

శ్రీనగర్: పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత మెహబూబా ముఫ్తీని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు ఫారూఖ్ అబ్దుల్లా, ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా.. శ్రీనగర్‌లోని ఆమె నివాసంలో కలుసుకున్నారు. దాదాపు 14.5 నెలల నిర్బంధం తర్వాత మంగళవారం రాత్రి ఆమె విడుదలయ్యారు. ఐదేళ్ల క్రితం ఉప్పునిప్పుగా ఉన్న వీరు ఇప్పుడు ఒకే చోటకు చేరడం పట్ల రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.


వీరి భేటి జమ్మూ కశ్మీర్ కోల్పోయిన ఆర్టికల్ 370 ని పునరుద్ధరించడమేనని వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని ఫారూఖ్ అబ్దుల్లా వద్ద ప్రస్తావించగా తమ కలయికలో ఎలాంటి రాజకీయ ప్రస్తావన లేదని చెప్పుకొచ్చారు. ‘‘మెహబూబా ముఫ్తీ సుమారు 14.5 నెలల తర్వాత నిన్న రాత్రి నిర్బంధం నుంచి విడుదల అయ్యారు. ఆమె ఎలా ఉందని చూడడానికే ఇక్కడికి వచ్చాను. అంతే కానీ, మా కలయికలో ఎలాంటి రాజకీయ ప్రస్తావన లేదు’’ అని ఫారూఖ్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-10-14T21:39:04+05:30 IST