తటస్థ పరిష్కరానికి రైతులు అంగీకరించాలి: జేడీయూ
ABN , First Publish Date - 2020-12-06T23:51:26+05:30 IST
కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులు తటస్థ ..

పాట్నా: కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులు తటస్థ (మధ్యే మార్గం) పరిష్కారానికి అంగీకరించాలని జేడీయూ సూచించింది. దేశ ఆర్థికవ్యవస్థకు చేయూత నిచ్చే విధంగా మధ్యేమార్గ పరిష్కారం ఉత్తమమని ఆ పార్టీ ప్రతినిధి రాజీవ్ రంజన్ ప్రసాద్ అన్నారు.
'దేశ ఆర్థిక సమస్యల పరిష్కారంలో వ్యవసాయ రంగం చాలా కీలకం. ఉభయ పక్షాలు (రైతులు, కేంద్రం) మధ్యే మార్గ పరిష్కారానికి అంగీకరించాలి' అని రంజన్ పేర్కొన్నారు. రైతు ఆందోళనల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. కొత్త చట్టాలకు సవరణలు అవసరమైతే కొత్త డ్రాఫ్ట్‌తో వస్తామని ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చెబుతోందని, అవసరమైతే కేంద్రం ఆయా రాష్ట్రాలతో చర్చలు జరపగలదని రంజన్ ప్రసాద్ అన్నారు.